అమిత్ షా గురిపెట్టిన బాణం ఎటువైపు ..????

        రాష్ట్రంలో బీజేపీ బలపడితే మొదటి దెబ్బ బాబుకేనా???

       ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అసంతృప్తి నేతలూ బీజేపీ వైపు చూస్తున్నారా ???

 

images

 

 

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాడేపల్లి గూడెం సభలో పార్టీ రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలనీ, ఆ క్రమంలో మిత్ర ధర్మాన్ని (టీడీపీ తో) పక్కన పెట్టినా పర్లేదని చెప్పేశారు. అమిత్ షా ఈ మాట గతంలో రాజమండ్రి సభలోనూ, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల నేతల సభలోను చెప్పారు. పార్టీని బలోపేతం చేయాలనీ, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ శూన్యత కనిపిస్తోందని చెప్పేశారు. అయితే రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ బంధాలకంటే వెంకయ్య – చంద్రబాబు బంధం బలంగా ఉండడంతో ఈ రెండున్నరేళ్లలో బీజేపీ అంగుళం కూడా ముందుకు జరగలేక పోయింది. ఇక ఇప్పుడు తప్పేలా లేదు. 

 

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలపడితే మొదట నష్టపోయేది తెలుగు దేశం పార్టీయే. చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీని నడిపించే సత్తా గల నాయకులు కనిపించడం లేదు. లోకేష్ నాయకత్వాన్ని ప్రస్తుత పార్టీ నేతలు గానీ, వారి వారసులు గానీ అంగీకరించే పరిస్థితులు లేవు. ఇంకో మాటలో చెప్పాలంటే పార్టీని ప్రస్తుతం ఉన్నంత బలంగా, పటిష్టంగా ఉంచే సమర్ధత లోకేష్ లో ఉందని పార్టీ నేతలు నమ్మడం లేదు. అందువల్ల వారికీ సమర్ధవంతమైన నాయకత్వం కావలి. జాతీయ పార్టీగా అలంటి నాయకత్వం ఇవ్వగలిగే సామర్ధ్యం బీజేపీకే ఉంది. అందువల్ల ప్రస్తుతం టీడీపీలో ఉన్న నాయకత్వం, శ్రేణులు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 
deli

టీడీపీ కి ఇంకో ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో శాసనసభా స్థానాలు పెరిగే అవకాశం విభజన చట్టంలోనేఉంది కాబట్టి దానిపై ఆశతో చంద్రబాబు భారీగా వలసలు ప్రోత్సహించారు. మొత్తం 20 మంది శాసన సభ్యులను, మరికొంత మంది నేతలను అయన ఈ రెండున్నరేళ్లలో పార్టీలో చేర్చుకున్నారు. వీరందరికి అయన 2019 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి అవకాశం కల్పిస్తానని చెప్పి ఆశలు రేకెత్తించారు. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం పార్టీ ఇంచార్జ్ లు గా పనిచేస్తున్న నేతలకు కూడా అయన భరోసా ఇచ్చారు. అయితే 2026 తర్వాతే శాసనసభా స్థానాలు పెరుగుతాయనీ, ఈలోగా సంఖ్యా పెంచే అవకాశం లేదని కేంద్రం ఇప్పుడు ఖరాకండిగా చెప్పేసింది. రాజ్యాంగంలోని 170 వ అధికరణ ప్రకారం రాష్ట్రాల్లో శాసన సభల స్థానాలు పెంచే, లేదా సవరించే అవకాశం లేదని హోమ్ శాఖ సహాయమంత్రి హన్సరాజ్ స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వారికీ 2019 ఎన్నికల్లో అవకాశం కల్పించే పరిస్థితి లేదు. అందువల్ల ఈ 20 మంది ఎమ్మెల్ల్యేలు కూడా బీజేపీ వైపు వెళ్లాల్సిందే. ఇది చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వస్తే 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమిని చూడాల్సి వస్తుంది. 

ven

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి,  కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకునే అవకాశం ఉన్న మాట వాస్తవం. అయితే బీజేపీ బలపడాలంటే వెంకయ్య నాయుడు, అయన శిష్యబృందం సిద్ధంగా లేరు. వారికి తమ పార్టీ మీద ప్రేమ కంటే చంద్రబాబు పై ఆరాధనే ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులను అధిగమించి అమిత్ షా బీజేపీని బలోపేతం చేయగలరా అనేది పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర చర్చగా మారింది.