తుస్సు మంటున్న బాబుగారి టెక్నాలజీ 

పుష్కరాలకు వాడిన సీసీ టీవీ కెమెరాలు తుక్కువే

1babu

కృష్ణా పుష్కరాల్లో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల అసలు రంగు బయటపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానంలో అందరికంటే తామే ముందున్నామనీ, ఆమాటకొస్తే అసలు టెక్నాలజీ దేశంలో ప్రవేశపెట్టింది తామేనని చెప్పుకునే ముఖ్యమంత్రి పుష్కరాల సందర్భంగా ఎంతో ఘనంగా ప్రదర్శించిన సీసీటీవీ కెమెరాలు తుక్కు కెమెరాలని తేలిపోయింది.

ఇకపై రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో మొత్తం పాలన జరగబోతోందని, తాము నాణ్యతలో రాజీ పడకుండా టెక్నాలజీ వాడుతున్నామని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ తుక్కు సీసీటీవీ కెమెరాలగురించి ఏమంటారు? నిప్పు ఇలాంటి నాసిరకం కెమెరాలను గొప్పగా ఎలా చెప్పింది? ఇంత నాసిరకం కెమెరాలు కొనుగోలు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారా?

2babu

కెమెరాలు నాసిరకం అని తేలుతోంది కనుక, అందులో అవినీతి జరిగిందని నిప్పు ఒప్పుకుంటుందా? ఇప్పటికే కృష్ణా పుష్కరాల పనుల్లో అవకతవకలు బయటపడుతున్నాయి. పుష్కరణ స్నాన ఘాట్లలో ఏర్పాటుచేసిన టైల్స్ ఊడిపోయి నిప్పు గారి తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇక టెక్నాలజీ డొల్ల ఇప్పుడే బయటకొచ్చింది.

3babu

సీసీటీవీలూ, డ్రోన్లతో ఏ ఘాట్ దగ్గర ఎంతమంది యాత్రికులు ఉన్నారు, ఏ ఘాట్ దగ్గర పరిశుభ్రత లేదు, ఏ మరుగుదొడ్డి ఎలా ఉంది అని చూసి పుష్కరాలు ఘనంగా నిర్వహించిన బాబు గారు ఇప్పుడు తుప్పు పట్టిన సీసీటీవీ కెమెరాల అవినీతిని ఏమంటారో, ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.