అభిమానిని క‌సురుకున్న బాల‌య్య‌

ప్ర‌జల‌తో జీవితాన్ని ముడివేసుకుని ఉన్న‌వాళ్ళు ఎలా ఉండాలి…!!? క‌నీసం ఆ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వ‌చ్చిన‌ప్పుడైనా ఆత్మీయ‌తానురాగాల‌ను ప్ర‌ద‌ర్శించాలి. స‌హ‌నం క‌న‌బ‌ర‌చాలి. దుందుడుకు స్వ‌భావం ఎల్ల‌వేళ‌లా చెల్ల‌దు. అభిమానులు ఆద‌రించినా.. చూసేవారు ఛీత్క‌రించుకుంటార‌నే ఇంగితం ఉండాలి. ఇదెవ‌రి గురించో అయితే ఇంత రాయాల్సిన అవ‌స‌రం లేదు. ఈనెల 12న విడుద‌ల కానున్న “గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి” చిత్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ గురించే ఈ విష‌యం చెబుతున్నది. అర్థం కావాలంటే మొత్తం జాగ్ర‌త్త‌గా చూడండి.

ఆదివారం సింహాచ‌లేశుని ద‌ర్శించుకుని బ‌య‌టకొచ్చిన బాల‌య్య ఆయ‌న్ను చూసేందుకు వ‌చ్చిన మ‌హిళ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. ఆప్యాయంగా త‌ల‌పై చేయివేసి నిమురుదామ‌నుకున్న ఇద్ద‌రు పెద్ద‌ల‌కు ఆ అవ‌కాశాన్నిచ్చారు. ఆయ‌నే మ‌హిళ చేతిని త‌న త‌ల‌పై పెట్టుకున్నారు. ఆ ప‌క్క‌నున్న మ‌రో మ‌హిళ కూడా బాల‌య్య త‌ల‌పై చేయి వేయ‌బోయారు. అంతే ఆయ‌న‌లో అస‌హ‌నం త‌న్నుకొచ్చింది. ఒక్క‌సారిగా త‌న‌దైన బాణీలో క‌సిరారు. అదెక్క‌డ బ‌య‌ట‌ప‌డిపోతుంద‌నుకున్నారో ఏమో వెంట‌నే రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తూ అక్క‌డినుంచి వెళ్ళిపోయారు. సంస్కారం ఒక‌రు చెబితే రాదు. స్వ‌త‌హాగా ఉండాలి. స‌మాజంలోకి వ‌చ్చినప్పుడూ ఇలాంటి వ్య‌వ‌హార‌శైలి దేనికి సంకేతం. అస‌హ‌నంగా ఉంద‌నుకుంటే అస‌లు ప‌ల‌క‌రించ‌నే కూడ‌దు. ప్ర‌జ‌లున్న దిక్కుగా చూడ‌కూడ‌దు. అవునా..కాదా…?