రాతలా?రోతలా?

09/01/2017 నాటి రాజగురువు పత్రిక వార్తలు చూడండి…

గాలేరు-నగరి పథకం కింద గండికోట జలాశయాన్ని 16 tmc ల సామర్ధ్యంతో నిర్మించారు..దాన్ని 26.85tmc సామర్ధ్యానికి పెంచారు….ఇంతకూ ఆ పెంచిన పెద్దాయన ఎవరో?ఆ పేరు రాయటం అంత నామోషీనా?

dramoji1

ఇక రెండవ పేజీ వార్త చూడండి…
రోజుకు 20,000 క్యూసెక్కుల కాలువల నిర్మాణం జరిగిందట…
**ఈ గాలేరు నగరి కాలువ అదివరకే ఉన్న శ్రీశైలం కుడి కాలువకు సమాంతరంగా ప్రయాణించి ఔకు రిజర్వాయర్ చేరాలి…ఈ గాలేరు-నగరి ఒకరకంగా ప్రారంభమయ్యే గోరుకల్లు రిజర్వాయర్ కు కూతవేటు దూరంలో నున్న పాణ్యం దగ్గరే పూర్తికాలేదు…ఎవరైనా హైదరాబాద్-తిరుపతి/కడప/నంద్యాల వచ్చేవారు బస్సులోంచి ఈ పనుల “పురోగతి” చూడొచ్చు.

dramoji2


ఇక ఆ ఔకు రిజర్వాయర్ కు ముందొచ్చే టన్నెల్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఏలికలకే తెలియాలి…ఆ ఔకు కు ముందొచ్చే కాలువ నిర్మాణం పనుల ఫోటో ఇస్తున్నా చూడండి..ఇవి బనగానపల్లె సమీపంలో తీసింది.
**ప్రస్తుతం సొరంగం పనుల్లో స్పష్టత వచ్చి రోజుకు 10,000 క్యూసెక్కులు పంపుతున్నారట…
అవును మరి…అప్పట్లో భగీరధుడి వెనకాల పరిగెత్తుకొస్తున్న గంగను జుహ్ను మహర్షి మింగి చెవి నుంచి బయటకు రప్పించినట్టి ఈ రాజగురువు పారిస్తున్నాడు మరి!
—ప్రస్తుతం శ్రీశైలం కుడి కాలువ ద్వారా కేవలం 1400 క్యూసెక్కుల నీరు వదులుతుంటే అవి ఔకు చేరుతున్నాయి…అక్కడి నుంచి గండికోటకు పంపించి 4tmc నిలువ ఉంచారు…
ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 861 అడుగులుంది…అది 854 కు చేరినప్పుడు పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలరు…
వీడి పిండాకూడు..ఇప్పుడు గండికోటకు తొలిసారి నీళ్లు చేరాయా?
2013 లోనే చేరాయి…ఆనాటి హిందు పత్రిక వార్తా క్లిప్పింగ్స్ ఇస్తున్నా చూడండి…

dramoji3dramoji4
ఇక గండికోట నుంచి 7.5tmc ఎత్తిపోస్తారా?
ముక్కుతూ మూల్గుతూ రోజుకు 1400 క్యూసెక్కులు చేరుతుంటే ఇప్పుడున్న 4 tmc లకు అదనంగా నీళ్లు గండికోటకు ఎప్పుడు చేరాలి?అక్కడ ఎన్ని నిలువుంచి 7.5tmc లు ఎత్తిపోయలి?

dramoji5dramoji6
dramoji7dramoji8

ఏముంది?ఆ మధ్య పట్టిసీమ …నిన్న ముచ్చుమర్రి…అలా వెనుతిరగ్గానే పంపులు ఆపడమే అంటారా..కానివ్వండి….
అయ్యా రాజగురువా…జీవిత చరమాంకం లో ఉన్నావు…ఎందుకు ఈ వెధవరాతలు…ఒక పంట పండించుకుంటే వలసలు పోకుండా మా పిల్లలనూ చదివించుకుందాం అని ఆశలో జనాలుంటారు…మీ కోస్తాంధ్ర వాళ్లే ప్రజలు కాదు,వారొక్కరే నీ పత్రిక కొనిచదవటం లేదు…
రోత రాతలు ఆపి జనాలను ప్రేమించటం నేర్చుకు చావు.

ఈ చెత్తరాతలు చదివి సమ్మలోరికిల్లా అంటూ software బ్రహ్మీ గాళ్లు హృదయపుష్పం ఎందుకు విప్పార్చుకోరూ!

by Gopireddy srinivasa Reddy gaaru.