ఎంత పోటుగానివిరా?ఎన్ని నోళ్ల పొగడుదురా!

ఈరోజు కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలో పైడిపాలెం ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమంలో జె.సీ.దివాకర్ రెడ్డి గారి నోట ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి…అచ్చంగా మొన్న మా కర్నూలు జిల్లా ముచ్చిమర్రి ఎత్తిపోతల కార్యక్రమంలో జాలువారినట్టే…. “బూట్లు నాకేవాడినైతే ఎప్పుడో మంత్రినయ్యేవాడిని”. —-తమరు కొత్తగా తెదేపాలో చేరారు కదా?మీకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవారా? సరే నాకేవాడివో చీకేవాడివో..అదే చిన్నప్పుడు నోట్లో వేలు….మాకెందుక్కానీ మా కర్నూలు జిల్లాకొచ్చి ఏమన్నావు?పెట్టినోడి మీద విశ్వాసం ఉండాలా? ఎవరు పెట్టారు?ఎవరికి పెట్టారు?

ysr-jc

మీ జిల్లాకు దోచుకుపోయిన మా కె.సి.కెనాల్ 5tmc లు మాకిస్తూ ఈ నంగనాచి కబుర్లెందుకు? GO-10 irrigation &I &CAD dated 21-01-2004 ప్రకారం కె.సీ.కెనాల్ నీళ్లు ఎవరు మీ జిల్లాకు దానం చేసారు నా రాజా? బాబు దిగిపోయే ముందు ఎందుకు ఈ హాడావుడి నిర్ణయం తీసుకున్నాడు?అవున్లే ఆ కామాంధుడే లేకుంటే వెన్నుపోటే పొడవగలిగి ఉండేవాడా?ముఖ్యమంత్రి అయ్యేవాడా?ఎంతైనా మామ నియోజకవర్గం తాగునీళ్లకనే చెప్పాడులే…

jc1

దానికి ప్రత్యామ్నాయం మాకు ఎందుకు చూపించలేదు నా సుందరా? మళ్లీ మీ జిల్లా వీరులంతా కలిసి YSR ను అడుక్కుని మరో 5tmc మానీళ్లే తీసుకుపోయారు… అప్పుడు కాదా YSR..GO-3 dated 04-01-2006 తెచ్చి కె.సీ.కెనాల్ కు పోతిరెడ్డిపాడు నుంచి ఆ 10tmc వరదజలాలు పారించుకొమ్మనింది! అంతేనా మన్మధా…ఈ పోతిరెడ్డిపాడు నుంచి పారించుకునే నీళ్లు కె.సి.కెనాల్ కింద వారికి ఉపయోగమే కానీ పాపం ఆ కాలువ 0-120 కి.మీ మధ్య ఉన్నవారికి నీళ్లు పారవని వారి కోసంGO-196 dated 31-08-2007 తీసుకువచ్చింది….ఇదేకదా ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం నా వీరా! ఇక ఆ ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకంలో అడ్డూఅదుపు లేని బ్లాస్టింగ్ చేస్తుంటే గ్రామస్థులు కోర్టు కు పోతే ఆ విషయం ప్రభుత్వం ఇచ్చిన అఫ్ఫిడవిట్లలో ఉంటే ఫాక్షన్ అంటూ తప్పుడు ప్రచారం ఎవరు చేసారు నా శూరా?

jc2

jc3

మరి మీజిల్లాకు అప్పనంగా 10tmc లు దొబ్బుకుని నీకెంత విశ్వాసం ఉందో? మీ జిల్లా మహానుభావులు ఒకరా ఇద్దరా…ఆధునిక గాంధి,నెహ్రు,పటేల్,ఇందిరాగాంధి….అందరూ మీరే…మీ జిల్లా వారి విగ్రహాలు తుళ్లూరు ఏరియాలోనూ ఉంటాయి…అసలా ఎరుపు అన్నల్లోనే చూడు..అన్నిచోట్లా ఆ దళం,ఈ దళం అని ఉంటారు..మీజిల్లాలో బాలకృష్ణ దళం,నాగార్జున,చిరంజీవి దళం ఉంటాయని అంటారే…. ఇంతటి పోటుగాళ్లు ఆ పాతవైన తుంగభద్ర కాలువలను మరమ్మత్తులు చేయించుకోవడమో..కొత్తగా సమాంతర కాలువలు తవ్వించుకోవడమో చేయరే… మీ పౌరుషాలు ఇంతేనా?మొన్నే అగ్రికల్చర్ కాలేజ్ సంపాదించావు,తి.తి.దే అధ్యక్ష పదవికి ఆశపడి వేదికల మీద తెగ రెచ్చిపోతున్నావు కానీ…ఆ గండికోటకు నీళ్లందించే గాలేరు-నగరి కాలువల పని పూర్తైందా? గోరుకల్లు రిజర్వాయర్ కు 5,6 కి.మీ దూరంలో కర్నూల్-కడప రోడ్ పక్కన ఉన్న కాలువల ఫోటోలు పెడుతున్నా..అలాగే బనగానపల్లె దగ్గరి ఫోటోలు పెడుతున్నా…ఇవి తప్పుడు ఫోటోలు అనగలవా? ఆ శ్రీకాంత్ రెడ్డిని ఆనక చీరుదువులే…ఎంత పోటుగానివబ్బా!!!….

newgandi1newgandi

—–By Gopireddy Srinivasa Reddy Gaaru.